నిత్యావసర ధరలను పరిశీలించిన ఉపముఖ్యమంత్రి

ప్రభుత్వ నిర్ణయించిన ధరలకే కురుపాం మండలంలోని నిత్యావసర సరుకులు, కూరగాయలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయా.. అనే విషయమై గురువారం ఉదయం ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే నిత్యావసరాలు, కూరగాయలు ప్రజలకు అందేటట్లు చూడాలని డిప్యూటీ తహసీల్దారుకు ఉపముఖ్యమంత్రి సూచించారు