నిరాడంబరంగా కేరళ సీఎం కూతురు పెళ్లి

నిరాడంబరంగా కేరళ సీఎం కూతురు పెళ్లి

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పెద్ద కుమార్తె వీణ వివాహం సోమవారం నిరాడంబరంగా జరిగింది. సిపిఎం యువజన విభాగం డివైఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షుడు, న్యాయవాది మహ్మద్‌ రియాజ్‌తో ఆమె వివాహం జరిగింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో.. అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుక జరిగింది. వీరిద్దరికీ ఇది రెండో వివాహమే. కాగా, వీణకు ఒకరు, రియాజ్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీణ బెంగళూరులో సొంతంగా స్టార్టప్‌ కంపెనీ నెలకొల్పి మేనేజింగ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక రియాజ్‌ 2009 లోక్‌సభ ఎన్నికల్లో కోజికోడ్‌ నియోజకవర్గం నుంచి సిపిఎం అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే.