నిరుపేదల జీవితాలు మారాలి -సీఎం జగన్
నిరుపేదల జీవితాలు మారాలి -సీఎం జగన్

నిరుపేదల జీవితాలు మారాలి -సీఎం జగన్

దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో చదువుల విప్లవం ప్రారంభించామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం విజయనగరంలో జగనన్న వసతి దీవెనపథకాన్ని ఆయన ప్రారంభించారు. వసతి దీవెన సాయాన్ని విద్యార్థుల ఖాతాలకు ఆన్‌లైన్‌ ద్వారా జమ చేశారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లైనా పేదల బతుకు మారలేదని.. నిరుపేదల జీవితాలలో మార్పులు రావాలని ఆకాక్షించారు. పేదల బతుకులు మారాలంటే వారి కుటుంబాలలో ఎవరో ఒకరు ఇంజనీర్, డాక్టర్, ఐఏఎస్ అవ్వాలన్నారు. డిగ్రీ, పీజీ జరిగే విద్యార్థులకు రెండు విడతలుగా రూ.20వేలు ఇస్తాం వసతి, భోజనం ఖర్చుల కోసం విద్యార్థుల తల్లులకు అందిస్తాం. కుటుంబంలో ఎంతమంది విద్యార్థులుంటే అంతమందికి ఇస్తామని సీఎం తెలిపారు. 1 లక్ష 87వేల మందికి ఈ పథకం వర్తిస్తుందన్నారు. వసతి దీవెన కింద రూ. 2,300 కోట్లు ఖర్చు చేస్తామని పేర్కొన్నారు. పేదల జీవితాలలో మార్పు తీసుకురావడానికే ఈ వసతి దీవెన పథకం అని తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో విద్యా దీవెన పథకం కింద ఏడాదికి 3,700 కోట్లు ఖర్చు చేయబోతున్నామని వెల్లడించారు. ఈ రెండు పథకాలతోనే 6,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. అమ్మ ఒడి పథకం ద్వారా 6,400 కోట్లు ఖర్చు చేశామన్నారు. రాష్ట్రంలో 25 లక్షల‌ మంది‌ నిరుపేదలకి రికార్డు స్థాయిలో ఉగాదికి ఇళ్ల స్థలాలు ఇవ్వబోతుంటే కొన్ని పత్రికలు, మీడియాల తప్పుడు ప్రచారాన్ని ఏమనాలి. చంద్రబాబును ప్రజలు మరిచిపోతారనే భయంతోనే ఆ పత్రికలు, ఛానెళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఏ తప్పు చేయకపోయినా రాక్షసులతో యుద్ధం చేయాల్సి వస్తోంది. ఇందుకు దేవుడి దయ, ప్రజల దీవెనలు కావాలి. రాష్ట్రంలో ఉంది.. ప్రతిపక్షం కాదు..రాక్షసులు అని సీఎం జగన్‌ విమర్శించారు.