నిర్భయ దోషి పవన్ గుప్తా దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. నిర్భయ సంఘటన జరిగిన సమయానికి తాను జువనైల్నని పేర్కొంటూ గతంలో పవన్ దాఖలు చేసిన పిటిషన్ను అప్పట్లోనే సుప్రీంకోర్టు కొట్టివేసింది. కాగా ఆ నిర్ణయాన్ని పున:పరిశీలించాలంటూ పవన్ తాజాగా మరొక పిటిషన్ను దాఖలు చేశాడు. సంఘటన జరిగిన నాటికి తాను జువనైల్నని, తన ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చాలని కోరాడు. అయితే తాజా పిటిషన్ను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది.
