నిర్భయ దోషులకు ఉరిశిక్ష పై స్పందించిన మహేశ్ బాబు

నిర్భయ హత్యాచారం కేసులోనలుగురు దోషులైన ముఖేష్ సింగ్, అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా, వినయ్ శర్మలను శుక్ర‌వారం ఉరి తీశారు. 2012లో నిర్భ‌య ఘ‌ట‌న జ‌రిగింది. ఎనిమిదేళ్ల పోరాటం తర్వాత నిందితులను ఉరి తీశారు. దీనిపై అగ్ర కథానాయకుడు మహేశ్ స్పందిస్తూ ట్వీట్ చేశారు. ‘‘చాలా కాలం వెయిట్ చేశాం. న్యాయం జ‌రిగింది. నిర్భ‌య ఘ‌ట‌న‌పై ఇప్పుడు జ‌రిగిన విష‌యం న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై న‌మ్మ‌కాన్ని మ‌రింత పెంచింది. మొక్క‌వోని న‌మ్మ‌కంతో పోరాటం చేసిన నిర్భ‌య త‌ల్లిదండ్రుల‌కు, న్యాయ‌వాదుల‌కు సెల్యూట్‌. న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై గౌర‌వం పెరిగింది. ఇలాంటి దురాగ‌తాల‌కు స‌త్వ‌ర న్యాయం ద‌క్కాలి, బ‌ల‌మైన చ‌ట్టాలుండాలి’’ అని తెలిపారాయన.