నివర్‌ తుఫాన్.. భారీగా కురుస్తున్న వర్షాలు

నివర్‌ తుపాన్‌ బుధవారం తీరం దాటింది. పుద్చుచేరి సమీపంలో తీరం దాటి అతి తీవ్ర తుపాను నుండి తీవ్ర తుపానుగా బలహీనపడింది. బుధవారం రాత్రి 11.30 గంటల నుంచి, గురువారం తెల్లవారు జామున 2.30 గంటల మధ్య నివర్‌ తుపాన తీరం దాటినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఈదురుగాలులు 100-110కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, అవి గంటకు 120 వేగం వరకు పుంజుకుంటాయని వాతారణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు భారత్‌లో వచ్చిన ఏడు రకమైన తుపానుల్లో..ఇది ఐదవదని, బలమైనదని చెప్పారు. ఈ తుపాను సముద్ర తీర ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. తుపాను అలజడికి తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు చెన్నై సముద్ర తీరంలో అలలు ఎగసిఎగసిపడుతున్నాయి. పలు చోట్ల సముద్రం ముందుకొచ్చింది. తమిళనాడులో ఇప్పటికే లక్షకు మందికి పైగా లోతట్టు ప్రజలను తరలించారు.