‘నిహారికపై అనవసర ప్రచారాలు చేయవద్దు’ :నాగబాబు

బంజారాహిల్స్‌లోని ర్యాడిసన్‌ బ్లూ హోటల్‌లోని ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో డ్రగ్స్‌ బయటపడటం టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే తాజాగా రాడిసన్‌ పబ్‌ ఘటనపై నాగబాబు స్పందించారు. ”నిహారిక విషయంలో ఎలాంటి తప్పు లేదని పోలీసులు చెప్పారు. అనుమానాలకు తావివ్వకుండా నేను స్పందిస్తున్నా. నిహారికపై అనవసర ప్రచారాలు చేయవద్దు. ” అని నాగబాబు తెలిపారు. కాగా ఈ పబ్‌కు హాజరైన వారిలో ఐదుగురు విదేశీయులు కూడా ఉన్నారని సమాచారం. పబ్‌లో పాల్గన్న 142 మంది వివరాలను పోలీసులు వెల్లడించారు. వీరిలో 99 మంది యువకులు, 33 మంది యువతులు పబ్‌లో పాల్గొన్నారు. 142 మంది అడ్రస్‌లు, ఇంటి నెంబర్‌లు తీసుకుని పోలీసులు నోటీసులు జారీ చేశారు.