ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి కుమారుడు రామ్మోహన్‌రెడ్డి వివాహా వేడుక రాగ మయూరి రిసార్ట్స్‌లో ఘనంగా జరిగింది. ఈ వివాహా వేడుకకు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, ఎంపీ సంజీవ్ కుమార్, ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, సాయిప్రసాద్ రెడ్డి, బాల నాగిరెడ్డి, కాటసాని రామిరెడ్డి, హఫీజ్ ఖాన్, మాజీ ఎంపీ బుట్టా రేణుక, చల్లా రామకృష్ణారెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి, బీవై రామయ్యతో పాటు పలువురు వైఎస్సార్ సీపీ నేతలు హాజరై నూతన జంటలను ఆశీర్వదించారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరిగి విజయవాడ బయల్దేరారు.

నూతన వధూవరులకు సీఎం జగన్ ఆశీర్వాదం