కరోనా లాంటి మహమ్మారితో చాలామంది డాక్టర్లు, నర్సులు పోరాడుతున్నారు. వారందరికీ సహాయాన్ని అందించేందుకు చాలామంది సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్‌ఖాన్ ఆ వరుసలో ముందున్నారు. విరాళం అందజేసిన తర్వాత కూడా ఆయన హెల్త్ వర్కర్లకు సహాయం చేయాలంటూ మొదటిసారి సోషల్ మీడియాలో నెటిజన్లను కోరారు. కోవిడ్-19తో యుద్ధం చేస్తున్నా హెల్త్ వర్కర్లకు పిపిఇ కిట్‌లు, మాస్క్‌లు అందేలా చూడాలన్నారు. ‘కరోనాతో పోరాడుతున్న ధైర్యవంతులైన హెల్త్ వర్కర్లు, మెడికల్ టీమ్స్‌కు పిపిఇ కిట్‌లను అందించండి. ఓ చిన్న సాయం జీవితాలను మార్చివేస్తుంది’ అనే వీడియోతో నెటిజన్లను సాయం చేయాలని అడిగారు. మొదటిసారి ఎన్‌జివో ద్వారా షారూక్‌ఖాన్ ప్రజలకు సందేశం అందించారు.
