నేటితో ముగియనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం

నేటితో ముగియనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం

ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారపర్వం ముగియనుంది. ఈ నెల 8న ఢిల్లీ శాసనసభకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. గత మూడు వారాలుగా ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. 
సాయంత్రం ఆరు గంటల అనంతరం ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ప్రచారంతో పాటు మద్యం దుకాణాలు కూడా బంద్ కానున్నాయి. కాగా ఈనెల 11న కౌంటింగ్‌ పూర్తి చేసి, అదే రోజున ఈసీ తుది ఫలితాలు వెల్లడించనుంది.