తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచే ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అసెంబ్లీ, మండలి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 2020-2021 ఆర్థిక సంవత్సరానికి ఈ నెల 8వ తేదీన(ఆదివారం) అసెంబ్లీలో బడ్జెన్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి హోదాలో తొలిసారి మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టనుండగా, మండలిలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రవేశపెడతారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత శాసనసభ, శాసనమండలిని ఎన్ని రోజులపాటు నిర్వహించాలనేది బీఏసీ నిర్ణయిస్తుంది..అటు.. శాసనసభ, శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా కోల్పోవడంతో ఉభయ సభల్లోనూ టీఆర్‌ఎస్‌కు మిత్రపక్షమైన ఎంఐఎం పార్టీ ప్రతిపక్షంగా కొనసాగుతోంది. శాసనసభలో ఎంఐఎంకు ఏడుగురు సభ్యులు ఉండగా, కాంగ్రెస్ పార్టీకి ఆరుగురు, బీజేపీకి రాజాసింగ్, టీడీపీకి మచ్చా నాగేశ్వర్‌రావు ఉన్నారు.

నేటి నుంచే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు