నేటి నుండి శ్రీవారి దర్శనం ప్రారంభం

తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం సోమవారం నుంచి ప్రారంభిస్తున్నారు. మొదటి రెండు రోజులకు తితిదే సిబ్బందిని, మూడో రోజు స్థానికులను అనుమతిస్తారు. పదకొండో తేదీ నుంచి బయట నుంచి వచ్చే భక్తులకు అవకాశం కల్పిస్తారు. కరోనా వ్యాప్తి కలకలం నేపథ్యంలో తిరుమల ఆలయాన్ని రెండు నెలల క్రితం మూసేసిన సంగతి తెలిసిందే. సోమవారం నుంచి దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలు తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే భౌతిక దూరం, శానిటైజర్లు తప్పనిసరి చేసింది. చాలా రోజుల తర్వాత తెరుచుకుంటున్న తిరుమల ఆలయాన్ని రకరకాల పూలు, పండ్లతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు.