నేడు అఖిలపక్ష సమావేశం

నేడు అఖిలపక్ష సమావేశం

 భారత్-చైనా సరిహద్దులో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని నరేంద్రమోడి శుక్రవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నేతలను ఈ వర్చువల్ సమావేశానికి ప్రధాని ఆహ్వానించారు. శుక్రవారం సాయంత్రం 5గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భారత్-చైనా సరిహద్దులో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించున్నట్లు ప్రధాని కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపిన సంగతి విదితమే.