నేడు అమరావతి రాజధాని గ్రామాల్లో బంద్

నేడు అమరావతి రాజధాని గ్రామాల్లో బంద్

మందడంలో పోలీసుల లాఠీచార్జ్‌కు నిరసనగా అమరావతి జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు రాజధాని గ్రామాల్లో బంద్ కొనసాగుతోంది. వ్యాపారులు స్వచ్చంధంగా దుకాణాలు మూసివేసి బంద్ పాటిస్తున్నారు. అత్యవసర సేవలు మినహా వ్యాపార కార్యకలాపాలు తెరుచుకోని పరిస్థితి నెలకొంది. మరోవైపు అమరావతిలో రాజధాని రైతుల ఆందోళనలు 67వ రోజుకు చేరుకున్నాయి. పెనుమాక, ఎర్రబాలెం, కిష్టాయిపాలెం, రాయవుడి, నేలపాడు, పెదపరిమితాడికొండ అడ్డరోడ్డు, 14వ మైలు, మందడం, తుళ్లూరులో రైతుల ధర్నా కొనసాగుతోంది.