నేడు ఏపీఎస్ ఆర్టీసీ కార్మికుల సామూహిక నిరాహారదీక్ష!

నేడు ఏపీఎస్ ఆర్టీసీ కార్మికుల సామూహిక నిరాహారదీక్ష!

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెబుతూ మరోవైపు, ఉన్న సౌకర్యాలను తొలగిస్తున్నారని ఏపీఎస్ ఆర్టీసీ కార్మికులు మండిపడుతున్నారు. ఆర్టీసీ ఎండీ తీసుకున్న పలు నిర్ణయాలను వ్యతిరేకించిన ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్.. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరాహార దీక్షలకు పిలుపునిచ్చింది. ఈయూ ఆధ్వర్యంలో 128 డిపోలు, వర్క్‌షాపుల వద్ద కార్మికులు నేడు సామూహిక నిరాహార దీక్షలకు దిగనున్నారు.