నేడు ఏపీ కేబినెట్ భేటీ
నేడు ఏపీ కేబినెట్ భేటీ

నేడు ఏపీ కేబినెట్ భేటీ

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్‌ సమావేశం జరగనుంది. మంత్రులంతా సామాజిక దూరం పాటించేలా..ఐదో బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్‌లో సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. మూడు నెలల బడ్జెట్‌కు ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకురానున్నట్లు సమాచారం. జూన్ 30 వరకు అవసరమైన నిధులకు ప్రభుత్వం ఆర్డినెన్స్ పెట్టనుంది. కేబినెట్‌ ఆమోదం అనంతరం ఈ ఆర్డినెన్స్‌ను గవర్నర్‌కు పంపనుంది.