నేడు సీఎం కేసీఆర్ కాళేశ్వరం పర్యటన

నేడు కేసీఆర్ కాళేశ్వరం పర్యటన

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కాళేశ్వరం పర్యటనలో భాగంగా నిన్న రాత్రి కరీంనగర్ లోని తీగలగుట్టపల్లికి చేరుకున్నారు. ఇవాళ ఉదయం 8.50 గంటలకు కరీంనగర్ లోని తీగలగుట్టపల్లి నుంచి రోడ్డుమార్గంలో కరీంనగర్‌ కలెక్టరేట్‌లోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 9.05 గంటలకు హెలికాప్టర్‌లో కాళేశ్వరం బయలుదేరుతారు. 9.30 గంటలకు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద ఉన్న హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడినుంచి రోడ్డుమార్గంలో కాళేశ్వరం ఆలయానికి చేరుకుని శ్రీకాళేశ్వర ముక్తేశ్వరస్వామిని దర్శించుకుంటారు. గోదావరిఘాట్‌ను కూడా సందర్శిస్తారు. అనంతరం తిరుగు ప్రయాణం అవుతారు.