నేడు జగన్ సమక్షంలో వైసీపీలోకి ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే!
నేడు జగన్ సమక్షంలో వైసీపీలోకి ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే!

నేడు జగన్ సమక్షంలో వైసీపీలోకి ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే! షాక్ లో టీడీపీ…

స్థానిక సంస్థల ఎన్నికలవేళ టీడీపీకి ఎదురు దెబ్బలు తప్పడం లేదు. అధికార పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌లోకి క్యూ కడుతున్నారు. అనంతపురం జిల్లాలోనూ మరో ముఖ్య నేత పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ శమంతకమణి, ఆమె కుమార్తె మాజీ ఎమ్మెల్యే యామిని బాల నేడు వైఎస్సార్‌సీపీలో చేరనున్నారు. సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే పార్టీ అనుచరులతో కలిసి విజయవాడ బయల్దేరినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ ఇప్పటికే నియోజకవర్గంలో తమ అనుచరులు, కార్యకర్తలు, అభిమానులతో చర్చలు జరిపారట.శమంతకమణి, యామిని బాల గత కొద్ది రోజులుగా అధిష్టానం తీరుపై అసంతృప్తిగా ఉన్నారట. తమ నియోజకవర్గంలో కొత్త వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని.. తమను పట్టించుకోవడం లేదని ఆగ్రహంగా ఉన్ననట్లు తెలుస్తోంది. అంతేకాదు స్థానికంగా జరుగుతున్న పార్టీ కార్యక్రమాలకు కూడా వీరు దూరంగా ఉంటున్నారట. శమంతకమణి ఇటీవల జరిగిన శాసనమండలి సమావేశాలకు హాజరుకాలేదు. దీంతో టీడీపీలో ఆసక్తికర చర్చ జరిగింది.. అయితే అనారోగ్య కారణంతోనే రాలేదని పార్టీ వర్గాలు చెప్పాయి. కానీ తర్వాత కూడా ఇద్దరు మహిళ నేతలు పార్టీకి కాస్త దూరంగా ఉంటున్నారు.