తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం మంగళవారం రాత్రి 8 గంటలకు రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ ఏర్పాటు చేసిన విందుకు కేసీఆర్ హాజరుకానున్నారు. సోమవారం రాత్రి తన వ్యవసాయ క్షేత్రం నుంచి సీఎం హైదరాబాద్కు వచ్చారు. మంగళవారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.
