నేడు ప్రకాశం జిల్లాలో చంద్రబాబు పర్యటన

నేడు ప్రకాశం జిల్లాలో చంద్రబాబు పర్యటన

ప్రకాశం జిల్లాలో మాజీ సిఎం చంద్రబాబు నేడు పర్యటించనున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు ఉండవల్లి నుంచి చంద్రబాబు ప్రకాశం జిల్లాకు బయలుదేరనున్నారు. 11 గంటలకు బప్పూడి కి చేరుకొని అక్కడున్న ఆంజనేయ స్వామి గుడిలో పూజలు చేస్తారు. 11.30 గంటలకు బస్సు యాత్రను ప్రారంభిస్తారు. 12.30 గంటలకు మార్టూరు బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. 12.50 గంటలకు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు క్యాంపు కార్యాలయంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పిస్తారు. 2.20 గంటలకు మేదరమెట్ల బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. 7 గంటలకు ఒంగోలు అద్దంకి బస్టాండ్‌ సెంటర్‌ లో ప్రసంగిస్తారు. రాత్రి 8 గంటలకు టిడిపి నాయకులతో సమావేశం కానున్నారు. తిరిగి 10 గంటలకు ఉండవల్లికి చంద్రబాబు బయలుదేరనున్నారు.