నేడు ప్రధానితో ఏపీ సీఎం జగన్‌ భేటీ

నేడు ప్రధానితో ఏపీ సీఎం జగన్‌ భేటీ

ప్రధాని మోడీతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బుధవారం సమావేశం కానున్నారు. ఢిల్లీలో సాయంత్రం 4.30 గంటలకు ఈ భేటీ ఉంటుంది. ఈ సందర్భంగా మూడు రాజధానుల నిర్ణయం, శాసనమండలి రద్దు అంశాలపై మోడీకి వివరణ ఇస్తారు. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన దిశ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం ఆలస్యమవుతోంది. దీనిపైనా ప్రధానితో చర్చిస్తారని అధికార వర్గాలు తెలిపాయి.