నేడు మళ్లీ ఢిల్లీకి జగన్

నేడు మళ్లీ ఢిల్లీకి జగన్

ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. విభజన హామీలు, తదితర అంశాలపై బుధవారం ప్రధాని మోడీతో ఆయన సమావేశమైన విషయం తెలిసిందే. విభజన హామీలతోపాటు మరికొన్ని అంశాలపై సిఎం సుదీర్ఘంగా చర్చించారు. ఇవే అంశాలపై చర్చించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో శుక్రవారం భేటీ కానున్నారు. రాష్ట్ర విభజన హామీల అంశం కేంద్ర హోంశాఖ పరిధిలోకి వస్తాయి కాబట్టి ఈ అంశాలపై అమిత్‌షాతో సిఎం చర్చించనున్నారు. దీంతోపాటు దిశ చట్టం గురించీ చర్చించే అవకాశం ఉంది.