నేడు, రేపు అరకు ఉత్సవ్

అరకు ఎన్టీఆర్ గ్రౌండ్లో అరకు ఉత్సవ్-2020 కు పర్యటకశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈరోజు సాయంత్రం పర్యాటక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఈ ఉత్సవ్‌ను ప్రారంభించనున్నారు. రెండు రోజుల పాటు జరుగున్న అరకు ఉత్సవ్‌లో క్రీడా పోటీలు, ఫుడ్‌ కోర్ట్‌లు, వివిధ రకాల స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఉత్సవ్‌లో గిరిజన సంప్రదాయ నృత్యాలతో పాటు సినీ సంగీత విభావరి పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.