నేడు విజయనగరంలో జగన్ పర్యటన

నేడు విజయనగరంలో జగన్ పర్యటన

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈరోజు నగరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 11:15 గంటలకు అయోధ్య మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో  పాల్గొని ‘జగనన్న వసతి దీవెన’ కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించనున్నారు. ఈ సభకు విద్యార్థులను తరలించేందుకు జిల్లాలోని అన్ని కళాశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. పోలీస్ బ్యారెక్స్ నుంచి అయోద్య మైదానం వరకు నాలుగు కిలోమీటర్ల పొడువున సీఎంకు స్వాగతం పలికేందుకు తొమ్మిది నియోజకవర్గాల నుంచి జనాన్ని తరలించేందుకు వారం రోజులుగా వైసీపీ నేతలు కసరత్తు చేసింది. విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేస్తున్నందున ‘థాంక్యూ సీఎం’ అని చెప్పించేందుకు ఈ పర్యటనను వేదికగా మలచుకునేందుకు వైసీపీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు.