నేడు విద్యా రంగంపై సీఎం జగన్ సమీక్ష

‘మన పాలన– మీ సూచన’ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం విద్యా రంగంపై సదస్సు నిర్వహించనున్నారు. విద్యా రంగంలో ఏడాది కాలంలో చేపట్టిన కార్యక్రమాలు, వాటి అమలు తీరు, తదితర అనేక అంశాలపై ఈ సదస్సు జరుగుతుంది. ఈ సదస్సుకు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, వివిధ విద్యా విభాగాలకు సంబంధించిన పలువురు ఉన్నతాధికారులు, ఆయా కార్యక్రమాల ద్వారా ప్రయోజనం పొందిన లబ్ధిదారులు దీనిలో పాల్గొని మాట్లాడనున్నారు.