నేడు సీఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్‌

నేడు సీఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్‌

కరోనాపై చేస్తున్న యుద్ధంపై అన్ని రాష్ర్టాల సీఎంలతో ప్రధాని మోడీ సోమవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, దశలవారీగా లాక్‌డౌన్‌ ఎత్తివేతపైనా చర్చిస్తారని సమాచారం. మినహాయింపులు, లాక్‌డౌన్‌ విషయంలో కేంద్రం నిర్ణయాలను కొన్ని రాష్ర్టాలు పాటించడం లేదు. కొన్ని రాష్ర్టాలైతే మే 3 తర్వాత కూడా లాక్‌డౌన్‌ కొనసాగింపుపై ఆసక్తి చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా అంశాలపై ముఖ్యమంత్రులతో ప్రధాని చర్చ జరపనున్నారని తెలుస్తోంది.