నేడే స్థానిక సంస్థల షెడ్యూల్ విడుదల
నేడే స్థానిక సంస్థల షెడ్యూల్ విడుదల

నేడే స్థానిక సంస్థల షెడ్యూల్ విడుదల

స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్రంలో ముఖ్యమైన రాజకీయ పార్టీలన్నింటితో తుది సంప్రదింపులు పూర్తయ్యాయని, శనివారం ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఎన్‌.రమేష్‌కుమార్‌ ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో వివిధ రాజకీయ పక్షాలతో సమావేశం అనంతరం కమిషన్‌ కార్యదర్శి రామసుందర్‌రెడ్డి, జాయింట్‌ సెక్రటరీ సత్యరమేష్‌లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తాయని, ఇది అందరిలోనూ ఏకాభిప్రాయం తెచ్చేందుకు ఉద్దేశించిన సమావేశం కాదన్నారు. ఎన్నికల ప్రక్రియను సరళీకృతం చేసే నిర్మాణాత్మక సూచనలను పరిగణలోకి తీసుకుంటున్నామన్నారు.