పంచాయతీరాజ్‌ సవరణ చట్టానికి ఆమోదం, టిడిపి వాకౌట్‌

 పంచాయితీరాజ్‌ చట్టానికి గతంలో అసెంబ్లీ ఆమోదించి పంపిన సవరణ బిల్లును మరోసారి సోమవారం శాసనసభ ఆమోదించింది. దీనిపై శాసనమండలి ద్వారా కొన్ని సవరణలు ప్రతిపాదించి అసెంబ్లీకి తిప్పి పంపగా వాటిని అసెంబ్లీ తిరస్కరించింది. ఇంతకముందు చేసిన బిల్లును యధాతథంగా ఆమోదించింది. దీనిపై ప్రతిపక్ష తెలుగుదేశం అభ్యంతరం వ్యక్తం చేసింది. మండలి ప్రతిపాదించిన సవరణలపై అసెంబ్లీలో చర్చ జరపాలని డిమాండ్‌ చేసింది. టిడిపి డిమాండ్‌ను స్పీకర్‌ తోసిపుచ్చారు. దీనికి నిరసనగా టిడిపి వాకౌట్‌ చేసింది. కొత్త సవరణ ప్రకారం పంచాయితీ రాజ్‌ ఎన్నికల్లో డబ్బు గానీ, మద్యంగానీ వాడినట్లు తేలితే అభ్యర్ధి విజయం సాధించిన తర్వాత కూడా కేసులు పెట్ట వచ్చు. ఆ విచారణలో నిజమని తేలితే గెలిచిన అభ్యర్ధులను పదవి నుంచి తప్పిస్తారు.