పంట నష్టంపై సీఎం జగన్‌ సమీక్ష
పంట నష్టంపై సీఎం జగన్‌ సమీక్షపంట నష్టంపై సీఎం జగన్‌ సమీక్ష

పంట నష్టంపై సీఎం జగన్‌ సమీక్ష

రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల నేపథ్యంలో పంట నష్టంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పంట నష్టం వివరాలను వెంటనే నమోదు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. యుద్ధ ప్రతిపదికన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పిడుగుపాటు, బోటు ప్రమాదాల్లో మరణించినవారికి 24 గంటల్లో పరిహారం చెల్లించాలని జిల్లా కలెక్టర్లకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.