పదేళ్ల ప్రస్థానం ..జగన్ ఆసక్తికర ట్వీట్
పదేళ్ల ప్రస్థానం ..జగన్ ఆసక్తికర ట్వీట్

పదేళ్ల ప్రస్థానం ..జగన్ ఆసక్తికర ట్వీట్

సరిగ్గా పదేళ్ల క్రితం 2011 మార్చి 12 వ తేదీన కడపజిల్లా కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్న వైఎస్ జగన్, ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో కొంతమేర ప్రభావం చూపించిన పార్టీ 2014 తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా నిలిచింది.కాగా, 2019 సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో పార్టీని ఏర్పాటు చేసిన పదేళ్లలోపే పార్టీ అధికారంలోకి రావడం విశేషం. పార్టీని నమ్మి సేవలు అందించిన ప్రతి ఒక్కరికి వైఎస్ జగన్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రాన్ని దేశంలో ఆదర్శరాష్ట్రంగా తీర్చి దిద్దుతానని ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా ప్రజలకు సందేశం ఇచ్చారు.