పలాసలో కోవిడ్ మృతదేహాన్ని జేసీబీతో తరలించిన ఘటనపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మానవత్వాన్ని చూపాల్సిన సమయంలో కొంతమంది వ్యవహరించిన తీరు బాధాకరమని వ్యాఖ్యానించిన ఆయన… బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టలర్ నివాస్‌ను ఆదేశించారు. ఈ ఘటనపై విచారణ జరిపిన జిల్లా కలెక్టర్ నివాస్.. పలాస మున్సిపల్ కమిషనర్ టి. నాగేంద్రకుమార్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఎన్. రాజీవ్‌ను సస్పెండ్ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

పలాస ఘటనపై సీఎం జగన్ సీరియస్