పవర్‌పుల్‌ టైటిల్‌తో ‘ఆర్‌సి-15’

రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఆర్‌సి-15’ చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌లో 50వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ పూర్తిచేసుకుంది. తదుపరి షెడ్యూల్‌ ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి ‘సర్కారోడు’ అనే టైటిల్‌ను రిజిస్టర్‌ చేయించారని తెలుస్తోంది. ఈ ఏడాదే చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఇందులో రామ్‌చరణ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌గా, ముఖ్యమంత్రిగా యస్‌.జె. సూర్య నటిస్తున్నారని ఇదివరకే వార్తలొచ్చాయి. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ లుక్‌తో పాటు టీజర్‌ను కూడా రామ్‌చరణ్‌ పుట్టినరోజు మార్చి 27న విడుదల చేస్తారని సమాచారం.