పారిశుధ్య కార్మికులకు నిత్యావసరాల పంపిణీ చేసిన కొడాలి నాని
పారిశుధ్య కార్మికులకు నిత్యావసరాల పంపిణీ చేసిన కొడాలి నాని

పారిశుధ్య కార్మికులకు నిత్యావసరాల పంపిణీ చేసిన కొడాలి నాని

కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపల్‌ కార్యాలయంలో 300మంది పారిశుధ్య కార్మికులకు మంత్రి కొడాలి నాని నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కరోనా నివారణకు అహర్నిశలు శ్రమిస్తున్న పారిశుధ్య కార్మికులను సామాజిక బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు. పారిశుధ్య కార్మికులను ఆదుకోవడానికి వైఎస్సార్‌సీపీ నాయకులు ముందుకు రావడం అభినందనీయమన్నారు.