పార్లమెంట్‌లో సొమ్మసిల్లిపడిపోయిన వైసిపి ఎంపి

 వైసిపి ఎంపి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ పార్లమెంట్‌లో సొమ్మసిల్లి పడిపోయారు. బిపి, షుగర్‌ ఒక్కసారిగా పడిపోవడంతో ఆయన కళ్లు తిరిగి పడిపోయారు.ఈ ఘటనపై  సహచర ఎంపిలు  వెంటనే స్పందించారు. స్ట్రెచర్‌ తెప్పించి ఆయన్నిస్థానిక  రామ్‌ మనోహర్‌ లోహియా  ఆసుపత్రికి తరలించారు.  ప్రస్తుతం ఐసియులో చికిత్స కొనసాగుతోందని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని సంబంధిత వైద్యులు తెలిపారు.