పింక్ రీమేక్ పై స్పందించిన రేణు దేశాయ్
పింక్ రీమేక్ పై స్పందించిన రేణు దేశాయ్

పింక్ రీమేక్ పై స్పందించిన రేణు దేశాయ్

దాదాపు రెండేళ్లపాటు వెండితెరకు దూరమైన పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ త్వరలో టాలీవుడ్ రీ-ఎంట్రీ ఇవ్వనున్నారు. బాలీవుడ్‌లో విజయవంతమైన పింక్ రీమేక్‌లో నటిస్తున్నారు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకుడు. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్ నటిస్తోందని ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ విషయం గురించి తాజాగా రేణు స్పందించారు. మీరు పింక్ రీమేక్‌లో నటిస్తున్నారా?` అని ఓ నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రేణును ప్రశ్నించారు. దీనికి స్పందించిన రేణు.. లేదు. అవన్నీ అసత్య కథనాలు అంటూ జవాబిచ్చారు.