పీజీ మెడికల్ ఫీజుల పెంపుపై హైకోర్టు ఉత్తర్వులు

పీజీ మెడికల్‌, దంత వైద్య ఫీజుల పెంపు జీవోపై తాజాగా తెలంగాణ హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల పీజీ మెడికల్‌, దంతవైద్య ఫీజులను పెంచుతూ ఇటీవల ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. ఈ పిల్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఏ కేటగిరీ విద్యార్థులకు ఫీజుల్లో యాభై శాతం చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది.అంతేగాక బి కేటగిరీ విద్యార్థులు ఫీజులో 60 శాతం చెల్లించాలని హైకోర్టు పేర్కొంది. మిగతా ఫీజుకు విద్యార్థులు బాండు రాసివ్వాలని విద్యార్థులకు కోర్టు ఆదేశించింది. ఎ 4 వారల్లోగా కౌంటరు దాఖలు చేయాలని టీఏఎఫ్‌ఆర్‌సీ, వైద్య కళాశాలలకు హైకోర్టు ఆదేశించింది. కరోనా సంక్షోభంలో పీజుల పెంపు విద్యార్థులకు భారమేనిన హైకోర్టు విచారణలో వ్యాఖ్యానించింది. తదపరి విచారణను 4 వారాలకు కోర్టు వాయిదా వేసింది.