పులివెందులలో రూ.110కోట్లతో ”ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌”కి శంకుస్థాపన

కడప జిల్లా పులివెందులలో ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రీటైల్‌ లిమిటెడ్‌ కంపెనీకి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. పులివెందుల పారిశ్రామికవాడలో రూ.110 కోట్లతో ఈ కంపెనీ ఏర్పాటవుతోందన్నారు. ఈ కంపెనీ ఏర్పాటులో తొలిదశలో రెండువేలకు పైగా ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. కంపెనీ ఏర్పాటయ్యాక ఉద్యోగావకాశాలు మరిన్ని పెరుగుతాయన్నారు. పరిశ్రమలకు కావల్సిన వారికి నైపుణ్యాభివృధ్ధి కళాశాలలో శిక్షణ కల్పిస్తామన్నారు. ఫార్చూన్‌ 500 కంపెనీల్లో ఆదిత్య బిర్లా గ్రూపు కూడా ఉందని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న పారిశ్రామిక వేత్తలకు సీఎం కృతజ్ఞతలు చెప్పారు.