పులివెందుల అభివృద్ధిపై సీఎం జగన్ సమీక్ష

పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ(పాడా)పై గురువారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ హరికిరణ్, పాడా అధికారులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. పులివెందుల మెడికల్ కాలేజీ శంకుస్థాపన, పనుల పురోగతిని అధికారులు వైఎస్‌ జగన్‌కు వివరించారు. ఆగష్టుకల్లా టెండర్ల ప్రక్రియ మొదలుపెట్టి త్వరితగతిన పూర్తిచేసి, ఈ సంవత్సరంలోగా మెడికల్ కాలేజీ పనులు ప్రారంభించాలని సీఎం వైఎస్‌ జగన్ అధికారులను ఆదేశించారు. జీఎన్‌ఎస్‌ఎస్‌ మెయిన్ కెనాల్-చక్రాయపేట లిఫ్ట్ ఇరిగేషన్‌ స్కీం పనుల పురోగతిపై ఆరా తీశారు. వీలైనంత త్వరగా పనులు గ్రౌండింగ్‌ కావాలని అధికారులతో అన్నారు. యుద్ధప్రాతిపదికన ఈనెలాఖరుకల్లా జ్యుడిషియల్ ప్రివ్యూ పూర్తిచేసి, టెండర్ల ప్రక్రియకు సిద్ధం కావాలని వైఎస్‌ జగన్‌ తెలిపారు