పులివెందుల అభివృద్ధిపై జగన్‌ సమీక్ష
పులివెందుల అభివృద్ధిపై జగన్‌ సమీక్ష

పులివెందుల అభివృద్ధిపై జగన్‌ సమీక్ష

వైఎస్సార్‌ జిల్లా పులివెందుల ప్రాంత అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శాఖల వారీగా చేపడుతున్న పనులను సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే విద్యా సంస్థలు, వైద్య సంస్థలు, ఇరిగేషన్‌ పనులపై సమీక్ష చేపట్టారు. పులివెందుల మెడికల్‌ కాలేజ్‌ పనులపై సీఎం వైఎస్‌ జగన్‌ రివ్యూ చేపట్టగా.. పనులకు సన్నద్ధవవుతున్నామని అధికారులు ఆయనకు తెలిపారు. అలాగే క్యాన్సర్‌ ఆస్పత్రి, ఇటీవల చేసిన శంకుస్థాపనలకు సంబంధించిన పనులపై సీఎం సమీక్ష నిర్వహించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లన్నీ ఒకే తరహా నమునాలో ఉండాలన్నారు. ఈసారి వదరనీరు వచ్చినప్పుడు గండికోట, చిత్రావతి రిజర్వాయర్లను పూర్తి స్థాయిలో నింపేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించి ముందుగానే అన్నిరకాల చర్యలు తీసుకోవాలని సూచించారు. ముద్దనూరు నుంచి కొడికొండ చెక్‌పోస్టు వరకు రోడ్డు విస్తరణ పనులపై దృష్టి సారించాలని.. వీలైనంత త్వరగా పనులను చేపట్టాలని ఆదేశాలు జారీచేశారు