పుష్ప’ పాటలు కెరీర్‌కే చాలెంజ్‌ విసిరాయి

 అల్లు అర్జున్‌ , క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్‌ సినిమా పుష్ప. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్‌. ఇందులో మొదటి భాగం ‘పుష్ప’ (ది రైజ్‌) క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 17న విడుదల కానుంది. వరుస బ్లాక్‌బస్టర్‌ చిత్రాలతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్‌, మరో నిర్మాణ సంస్ధ ముత్తంశెట్టి మీడియాతో కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీ అప్‌డేట్‌ కూడా సోషల్‌ మీడియాలో సంచలనం రేపింది. ఈ చిత్రంలోని దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి, సామి సామి, ‘ఏరు బిడ్డా ఇది నా అడ్డా’ పాటలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. దుమ్ము రేపుతున్న ఈ పాటల వెనుక సుకుమార్‌, చంద్రబోస్‌, దేవిశ్రీల సూపర్‌ కాంబో ఉందనేది మనకు తెలిసిందే. ‘పుష్ప’లోని సాంగ్స్‌ అన్ని వర్గాల ప్రేక్షకులనీ మెస్మరైజ్‌ చేస్తున్న సందర్భంగా గీత రచయిత చంద్రబోస్‌ మీడియాతో ముచ్చటించారు.