పోలీసులపై పొగడ్తల వర్షం కురిపించిన మహేష్ బాబు
పోలీసులపై పొగడ్తల వర్షం కురిపించిన మహేష్ బాబు

పోలీసులపై పొగడ్తల వర్షం కురిపించిన మహేష్ బాబు

మహమ్మారి కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడానికి అలుపెరగని పోరాటం చేస్తున్న తెలంగాణ పోలీస్‌ శాఖకు టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. ఈ మేరకు గురువారం ట్వీట్‌ చేశాడు. ‘అత్యంత సవాలుతో కూడిన ఈ క్లిష్ట సమయంలో మమ్మల్ని అదేవిధంగా మా కుటుంబాల జీవితాలను, ఆరోగ్యాన్ని కాపాడుతున్నందుకు ధన్యవాదాలు. ప్రజలు, దేశం పట్ల మీ నిస్వార్థ సేవకి, అంకితభావానికి సెల్యూట్‌ చేస్తున్నా’అని మహేశ్‌ బాబు ట్వీట్‌ చేశాడు.

‘కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్దంలో అలుపెరగని పోరాటం చేస్తున్న తెలంగాణ పోలీసులకు హృదయపూర్వక ధన్యవాదాలు. కఠినమైన ఈ సమయంలో మీరు చేస్తున్న కృషి కచ్చితంగా అసాధరణమైనది’అంటూ మరో ట్వీట్‌లో మహేశ్‌ పేర్కొన్నాడు.