పోలీసులపై ప్రశంసలు కురిపించిన సజ్జల రామకృష్ణ రెడ్డి
పోలీసులపై ప్రశంసలు కురిపించిన సజ్జల రామకృష్ణ రెడ్డి

పోలీసులపై ప్రశంసలు కురిపించిన సజ్జల రామకృష్ణ రెడ్డి

ప్రపంచానికి కష్టకాలం వచ్చిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కరోనాకు పూర్తి స్థాయి మందు రాలేదని, సామాజిక దూరం పాటించాలని సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. మనకున్న వాలంటీర్ల వ్యవస్థతో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నామన్నారు. మిగిలిన రాష్ట్రాలకంటే మన దగ్గర కొంత మెరుగ్గా ఉందని, పోలీసులు సైనికుల్లాగ పనిచేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. పోలీసులకు శానిటైజర్లు, మాస్కులను బుధవారం సజ్జల పంపిణీ చేశారు.