‘దిశ’ పోలీస్ స్టేషన్ను హోం మంత్రి తానేటి వనిత శనివారం సందర్శించారు. సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. మహిళల రక్షణ కోసమే ‘దిశ ‘యాప్, దిశ చట్టాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకువచ్చారని హోంమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి 24 లక్షల మందికి పైగా దిశ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారన్నారు. చదువుకొనే ప్రతి విద్యార్థిని దిశా యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.మహిళలపై దాడులను సీఎం జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరన్నారు. ఇటీవల మహిళలపై దాడులు చేయడం టిడిపి నేతలకు అలవాటుగా మారిందన్నారు. వారే దాడులు చేసి వారే తిరిగి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. విశాఖ నగరంలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన టిడిపి నేత పై కేసు నమోదు చేశామన్నారు.
