ప్రధాని నివాసంలో కేంద్ర కేబినెట్ భేటీ
ప్రధాని నివాసంలో కేంద్ర కేబినెట్ భేటీ

ప్రధాని నివాసంలో కేంద్ర కేబినెట్ భేటీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో కేంద్ర కేబినెట్ భేటీ జరుగుతోంది. న్యూఢిల్లీ లోక్ కల్యాణ్ మార్గ్‌‌ 7లోని ప్రధాని నివాసంలో జరుగుతోన్న ఈ కేబినెట్ సమావేశంలో కరోనా లాక్‌డౌన్‌పై సమీక్ష జరుపుతున్నారు. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో కరనో కట్టడికి తీసుకుంటోన్న చర్యలపై చర్చిస్తున్నారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడులో తీసుకుంటోన్న చర్యలపై చర్చిస్తున్నారు. పలు రాష్ట్రాల్లోని అనేక జిల్లాల్లో కరోనా కేసులు కొత్తగా నమోదు కాకపోవడాన్ని కూడా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌తో జరిపిన వీడియో కాన్ఫరెన్స్ వివరాలు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రధానికి వివరించారు.