ప్రధాని పర్యటనకు సీఎం కేసీఆర్‌ దూరం

ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్‌ చేరుకున్నారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు గవర్నర్‌ తమిళసై, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చారు. అయితే ఈ పర్యటనకు సీఎం కేసీఆర్‌ దూరంగా ఉంటున్నారు. స్వల్ప అస్వస్థత కారణంగా ఆయన ఈ పర్యటనకు దూరంగా ఉంటున్నట్లు అధికారులు తెలిపారు. జ్వరం తగ్గితే ముచ్చింతల్‌ కార్యక్రమానికి కేసీఆర్‌ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.