ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

శ్రీశైలం జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో అగ్నిప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఘటనపై మంత్రి జగదీష్‌ రెడ్డి, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావును అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో చిక్కుకుపోయిన తొమ్మిది మందిని బయటకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.