ప్రముఖ చిత్రకారుడు చంద్ర కరోనాతో కన్నుమూత

ప్రముఖ చిత్రకారుడు, రచయిత చంద్ర (74) కరోనాతో కన్నుమూశారు. గత మూడేళ్లుగా నరాలకు సంబంధించిన చికిత్స తీసుకుంటున్న చంద్ర కరోనా బారినపడటంతో సికింద్రాబాద్‌లోని మదర్‌ థెరిసా రీహాబిటేషన్‌ సెంటర్‌లో చికిత్స పొందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందారు. చంద్ర భౌతికకాయాన్ని బంజారాహిల్స్‌ శ్రీనగర్‌ కాలనీలోని నివాసానికి తరలించారు.