ప్రముఖ నిర్మాత మృతి

ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత కొడాలి వెంకటేశ్వరరావు సతీ మణి అనిత (57) అనారోగ్యంతో మృతి చెందారు. ఈమె కూడా పలు చిత్రాలను నిర్మించారు. వెంకటేశ్వరరావు-అనితల కుమార్తె స్వాతి గతంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ బాల రామాయణంలో రావణాసురుడి పాత్ర పోషించారు. అనిత మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.