కోలీవుడ్ ప్రముఖ యాంకర్, సినీనటుడు ఆనందకణ్ణన్ (48) క్యాన్సర్‌తో కన్నుమూశారు. క్యాన్సర్‌తో బాధపడుతూనే ఆయన నవ్వుతూ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారం క్రితం హఠాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో ఆయన్ని చెన్నైలోని ఓ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆగష్టు 16 న ఆనంద మృతి చెందినట్లు తెలుస్తోంది. యూత్ ఐకాన్‌గా పేరున్న ఆనంద మృతి విషయం తెలిసి కోలీవుడ్ దిగ్భ్రాంతికి గురయింది. సింగపూర్-తమిళియన్ అయిన ఆనంద.. క్రియేటర్‌గా, నటుడిగా 30 ఏళ్ల పాటు తమిళ ఆడియెన్స్‌ను అలరించారు. ఏకేటీ థియేటర్స్‌ను ఏర్పాటుచేసి.. వర్క్‌షాప్స్‌తో రూరల్ కల్చర్ ద్వారా వర్థమాన నటులెందరినో ప్రోత్సహించారు. 90 వ దశకంలో కోలీవుడ్ ఆడియెన్స్‌కు అభిమాన నటుడిగా చేరువయ్యారు. ముఖ్యంగా సన్ టీవీ సిరీస్ సింధ్‌బాద్‌లో లీడ్ రోల్ ద్వారా పిల్లలను, యువతను ఆకర్షించారు. సింగపూర్‌లో వసంతం టీవీ ద్వారా వీజేగా కెరీర్ ప్రారంభించిన ఆనంద.. తర్వాత చెన్నైలో స్థిరపడ్డారు. సన్ మ్యూజిక్ తో పాటు సన్ టీవీలో సీరియళ్ల ద్వారా ఆడియెన్స్‌ను అలరించారు. ‘సరోజ, అదిసయ ఉల్గం’ చిత్రాల్లో ఆయన నటించగా.. మరో రెండు చిత్రాలు రిలీజ్‌కు నోచుకోలేదు. సింగపూర్‌లోనూ ఆయన షోలు హిట్టయ్యాయి. ఆనంద మృతిపై సింగపూర్ సెలబ్రిటీ వడివళన్, కోలీవుడ్ దర్శకుడు వెంకట్ ప్రభు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
