ప్రముఖ హాస్య నటుడు కరోనాతో కన్నుమూత

తమిళనాడు సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ హాస్య నటుడు వివేక్‌, ప్రముఖ దర్శకుడు కెవి ఆనంద్ మరణాలను మరచిపోక ముందే…మరో కమెడియన్‌,, సీనియర్‌ నటుడు పాండు (74) కోవిడ్‌తో గురువారం కన్నుమూశారు. ఇటీవల కరోనా బారిన పడ్డ ఆయన..తదుపరి చికిత్స నిమిత్తం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూనే తుదిశ్వాస విడిచారు.